Colombian: రూ.9 లక్షల విలువగల కొకైన్ ను విగ్‌లో దాచాడు..! 1 y ago
రాఫెల్ నూనెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ కొలంబియన్ ప్రయాణికుడి హెయిర్ స్టైల్ అనుమానాస్పదంగా ఉండటంతో భద్రతా సిబ్బంది అతన్ని తనిఖీ చేశారు. అతని తలపై విగ్ అతికించినట్లు కనిపించడంతో పరిశీలించారు. అందులో 10 కొకైన్ గుళికలు దొరికాయి. వీటి విలువ సుమారు 10 వేల యూరోలు (రూ.9.1 లక్షలు) ఉంటుందని అధికారులు వెల్లడించారు.