Pakistan: పాక్‌కు మరో జలాంతర్గామిని అందించిన చైనా 1 y ago
తమ మిత్రదేశం పాకిస్థాన్ కు చైనా మరో జలాంతర్గామినిచ్చింది. 5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మొత్తం 8 హ్యాంగర్ క్లాస్ సబ్ మెరైన్లను ఇస్లామాబాద్ కు బీజింగ్ ఇవ్వాల్సి ఉండగా గతంలో ఒకటి అందించింది. ఈ రెండూ కాకుండా అత్యాధునిక ఫ్రిగేట్ నౌకలు నాలుగింటిని కూడా సమకూర్చింది. అరేబియా సముద్రంలో భారత్ ను అడ్డుకునేందుకు పాక్ ను వాడుకోవాలనేది చైనా వ్యూహమని తెలుస్తోంది. అందుకే పాక్ నేవీని చైనా బలోపేతం చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.