వైఎస్సార్ జిల్లా కాదు..వైఎస్సార్ కడప జిల్లా... క్యాబినెట్ కీలక నిర్ణయం 1 y ago
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు 200, పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్తు ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాగా మార్చిన పేరుని వైఎస్సార్ కడప జిల్లాగా, వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పేరును తాడిగడప మునిసిపాలిటీగా మార్చాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా నంబూరులో వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలాజికల్ యూనివర్సిటీని బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ప్రైవేటు విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది.