మంత్రి నారయణ, సీఆర్డీఏ అధికారులతో సీఎం సమావేశం 1 y ago
రాజధాని పనుల పునఃప్రారంభంపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో సీఆర్డీఏ అధికారులు, మంత్రి నారాయణతో సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ముహూర్తం,శంకుస్థాపన, స్థలం ఎంపిక తదితరాలపై మాట్లాడారు. రాజధాని పనుల పునఃప్రారంభం పై ప్రధాని ముందు ఉంచాల్సిన ప్రతి పాదనలపై చర్చలు జరిపారు.