అమెరికాలో జరగనున్న ద్వైవార్షిక సభలకు సీఎంకు ఆహ్వానం .. 1 y ago
AP: అమెరికాలోని డెట్రాయిట్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ ద్వైవార్షిక మహాసభలు జులై 3, 4, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ మేరకు 24వ ద్వైవార్షిక మహాసభలకు సీఎం చంద్రబాబు రావాల్సిందిగా తానా సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని వివరించారు. సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తానా ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, డైరెక్టర్ సునీల్ పాంట్ర, మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి పాల్గొన్నారు.