Champions Trophy: రేపటి నుండే ఛాంపియన్స్ ట్రోఫీ.. 1 y ago
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. బుధవారం (ఫిబ్రవరి 19) గ్రాండ్ గా ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడనుంది. కరాచీలోని నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యం ఇస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నీ జరగనుండడంతో ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. ఆతిధ్య పాకిస్థాన్ తో పాటు, భారత్ జట్లు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నాయి.వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లన్నీ టీవీ ఛానెల్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియో హాట్ లలో ఈ మ్యాచ్ లు లైవ్ చూడొచ్చు. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ లన్ని మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి.