కాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం..! 1 y ago
TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో కాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను మంత్రివర్గంలో ప్రతిపాదించనున్నారు. తరువాత కేబినెట్ కూడా ఆ బడ్జెట్ ను ఆమోదించనుంది. అనంతరం బడ్జెట్ ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి తన శాఖకు కొంచెం ఎక్కువ డబ్బులు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబు భట్టిని రిక్వెస్ట్ చేశారు. దీనిపై భట్టి విక్రమార్క .. అంతా 'ఏఐ' కదా అంటూ చమత్కరించారు.