Palamuru Project: పాలమూరు అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి 1 y ago
టీజీ : కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల ఇళ్లు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత పదేళ్లలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదన్నారు. 2004 - 14 మధ్య కాంగ్రెస్ 50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు. ఏడు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చిందని అన్నారు. పాలమూరులో పేదరికాన్ని గత పాలకులు పట్టించుకోలేదని తెలిపారు. కృష్ణా నది పక్కనే ఉన్నా పాలమూరులో పసిడి పంటలు ఎందుకు పండలేదని ప్రశ్నించారు. కేసీఆర్కు పాలమూరు ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారని తెలిపారు.
కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చి పాలమూరును ఎడారిగా మార్చారన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఏపీతో గొడవ ఉండేది కాదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులు మొదలు పెట్టామని చెప్పారు. పాలమూరు పచ్చబడేలా చేస్తామంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారన్నారు. కేసీఆర్ పాపాలు పాలమూరు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. తాము ఏమీ చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోందని కానీ ఏడాదిలోనే రూ. 21 వేల కోట్లతో రుణమాఫీ చేశామన్నారు.