Buggana: పేదలకు ఎప్పుడూ తక్కువే..పేదరిక నిర్మూలనపై ప్రాధాన్యత 1 y ago
AP : బడ్జెట్ ప్రసంగంలో 35 సార్లు గత ప్రభుత్వం అని ప్రస్తావించడం అసక్తికరంగా ఉందన్నారు వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి నేతల హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు. ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదన్నారు. ఒక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినన్ని అప్పులు చరిత్రలో ఎవరూ చేయలేదన్నారు.
ఎవరూ పేదరికంలో ఉండకూడదన్నారు. పేదలు అసహనంగా, అసంతృప్తిగా ఉంటే సమాజానికి మంచిది కాదన్నారు. పేదలకు ఎంత చేసినా తక్కువే అని పేర్కొన్నారు. పరిపాలనలో పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వాన్ని హేళన చేయడం సరికాదన్నారు. వైఎస్ జగన్ చేసే పనులు మాత్రమే చెబుతారని.. చేయలేనివి చెప్పరని పేర్కొన్నారు. అందుకే గత ఎన్నికల్లో గెలవలేకపోయామని చెప్పారు.
అన్నదాత సుఖీభవ పథకం ఎవరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రైతులకు పెద్దపీట వేస్తూ రైతు భరోసా పథకాన్ని అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పుడు తడకగా ఉన్నాయన్నారు. వైసీపీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు.