Botsa: "18 వీసీల రాజీనామా పై బొత్స సత్య నారాయణ ఎంక్వైరీ డిమాండ్" 1 y ago
AP : యూనివర్సిటీ వీసీలతో కూటమి నాయకులు బలవంతంగా రాజీనామా చేయించారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ. రాష్ట్ర చరిత్రలో ఒకేసారి 18 మంది వీసీలు రాజీనామా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వీసీల నియామకంపై ఎంక్వైరీకి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ అంశంపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించి అంశాలు ఏమీ లేవన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని కానీ వ్యవస్థలు ముఖ్యమని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమన్నారు.