Tourism: పర్వతమాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు రోప్ వేలు 1 y ago
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే ప్రాధాన్యంగా రోప్ వే పర్యాటకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకచర్యలుచేపడుతుంది. భువనగిరి కోట-ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల ఆరవ విక్రమదిత్యచే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా ఈకోటకు త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది. ఈకోటపక్కనేవున్నా హైదరాబాద్-వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటరు దూరం మేరకు రోప్ వేఏర్పాటుచేయనున్నారు. రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత ప్రాధాన్యం ఉన్న భువనగిరి కోటను స్వదేశీదర్శన్ 2.0 పథకం కింద రూ.56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడంతో పాటు, 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటరు దూరం వరకు రోప్ వే మార్గాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో తొలి రోప్ వేగాఈ పర్యాటకం గుర్తింపు పొందుతుంది. ట్రెక్కింగ్ ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో ఒకటైన ఈ కోటపైకి చేరడానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఇప్పుడు రోప్ వే ఏర్పాటైతే మెట్లు ఎక్కే సమస్య తగ్గడంతోపాటు రోప్ వే సరికొత్త అనుభూతిని పంచుతుంది.
భువనగిరి కోటతో పాటు రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పర్వతమాల ప్రాజెక్టు కింద యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి 2 కి.మీ, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి 2కి.మీ, నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా 5 కి.మీ, మంథనిలోని రామగిరి కోట వరకు 2 కి.మీల రోప్ వేలను మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికలు పంపనున్నారు.