అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి 1 y ago
TG : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొత్తం రూ. 3 లక్షల 4 వేల 965 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు తమ విధానమన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం రేవంత్ పాలన చేస్తున్నారన్నారు. రెవెన్యూ వ్యయం రూ. 2 లక్షల 26 వేల 982 కోట్లు అని తెలిపారు. మూలధన వ్యయం రూ. 36,504 కోట్లు అని చెప్పారు.