Baby John: 'బేబీ జాన్' ఓటిటి ఇందులోనే... 1 y ago
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ నటించిన "బేబీ జాన్" సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు 9 భాషల్లో, సబ్ టైటిల్స్‌తో ప్రేక్షకులు చూడవచ్చు. సినిమా కథలో జాన్ తన కూతురుతో కేరళలో నివసిస్తుంటాడు. తార అనే టీచర్ వల్ల వారికి ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదాన్ని జాన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ. కీర్తి సురేశ్ బాలీవుడ్‌లోకి ఈ సినిమాతో అడుగుపెట్టింది. సమంత వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని ఆమె తెలిపింది.