Rekha Bhoj: బేబీ నిర్మాత పై మండిపడ్డ తెలుగు హీరోయిన్..! 1 y ago
తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయబోమన్న 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ పై హీరోయిన్ 'రేఖా భోజ్' మండిపడ్డారు. ఇప్పుడేదో తెగ ఆఫర్లు ఇస్తున్నట్లు. ప్రతొక్కడూ పెద్ద ఉద్దరిస్తునట్లు ఎదవ బిల్డప్పులు. ఒక రకంగా ఇది తెలుగు అమ్మాయిలపై అధికారకంగా బ్యాన్ చేసినట్టే. మా బ్రతుకుదెరువు పై కొట్టేలా మాట్లాడిన తర్వాత మీకు గౌరవం ఇచ్చేదేంటీ?' అని అసహనం వ్యక్తం చేశారు. మాంగళ్యం, రంగీలా, దామిని విల్లా వంటి సినిమాల్లో రేఖా భోజ్ నటించారు.
డ్రాగన్ ఈవెంట్ లో బేబీ నిర్మాత వ్యాఖ్యలు..
డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'బేబీ' మూవీ నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు ధరి తీశాయి. మేము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలను ఎక్కువ లవ్ చేస్తాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత నాకు తెలిసింది. ఇకనుంచి తెలుగు రాని హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయాలనీ అనుకుంటున్నాము' అని చెప్పారు. దీంతో తెలుగు నిర్మాతే ఇలా అంటే ఎలా? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.