Axar Patel: కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేశా: అక్షర్ పటేల్ 1 y ago
పాకిస్థాన్ తో మ్యాచ్లో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తాను కూడా లెక్కలు వేసుకున్నట్లు భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. కోహ్లి 86పై ఉండగా.. విజయానికి 19 పరుగులు కావాల్సినప్పుడు అక్షర్ క్రీజులో అడుగుపెట్టాడు. "చివర్లో కోహ్లి సెంచరీ కోసం నేను కూడా లెక్కలు వేసుకున్నా. బ్యాటు అంచును బంతి తాకడం లేదా మరేదైనా జరగొద్దని కోరుకున్నా. చాలా సరదాగా అనిపించింది. నా కెరీర్లో ఈ స్థాయి ఒత్తిడి ఉన్న మ్యాచ్ను క్రీజులో ఉండి చూడటం ఇదే తొలిసారి" అని అక్షర్ వివరించాడు.