ఔరంగజేబు సమాధి వివాదం..నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ 1 y ago
మహారాష్ట్రలోని శంభాజీ నగర్ లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు దుండగులు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో దాదాపపు 20 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నాగ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.