ఏపీలో ఎయిర్ ట్యాక్సీలు రెడీ..గుంటూరు నుంచే.. 1 y ago
AP: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుంటూరుకు చెందిన చావా అభిరాం అమెరికాలో రోబోటిక్స్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తి చేశారు. చైనా వంటి దేశాలతో పోటీ పడుతూ అభిరాం ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. 2019లో గుంటూరు శివారులోని నల్లచెరువులో 'మ్యాగ్నమ్ వింగ్స్' సంస్థను ఏర్పాటు చేసి, రెండు సీట్లతో కూడిన ఎయిర్ ట్యాక్సీని రూపొందించి వీ2 అని పేరు పెట్టారు.