Farooqui: మారక్రమ్ ను నెట్టిన అఫ్గాన్ బౌలర్ పై విమర్శలు 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్గనిస్తాన్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ఆఫ్గాన్ బౌలర్ ఫరూఖి వేశాడు. మంచి యార్కర్ సంధించాడు. ఆ బంతికి మారమ్ సింగిల్ తీసుకొని నాన్స్ట్రకింగ్కు వచ్చాడు. అప్పుడు ఫరూఖి మళ్లీ బంతిని విసిరేందుకు వెళ్తూ మారమ్‌ను కాస్త పక్కకి నెట్టాడు. అయితే, ఆ తర్వాత నవ్వుతూ ముందుకుసాగాడు. కానీ, కామెంటేటర్లుగా వ్యహరించిన ఎంబాగ్వా, షాన్ పొలాక్ కాస్త అసహనం వ్యక్తంచేశారు. అఫ్గాన్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై మ్యాచ్ రిఫరీ దృష్టిసారించి జరిమానా విధించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్లు చేస్తున్నారు.