Polycet: ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష...! 1 y ago
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2025ను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరీక్షకు సుమారు 1.50 లక్షల మంది హాజరవుతారని సమాచారం. పాలిసెట్ పరీక్షను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీనిని నిర్వహిస్తారు.