Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 ప్రొఫెషనల్ పోస్టులకు నోటిఫికేషన్ 1 y ago
బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో 518 ప్రొఫెషనల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ మేనేజర్, మేనేజర్-ఫుల్‌స్టాక్ డెవలపర్, క్లౌడ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్ సహా పలు విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. అభ్యర్థులు డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ పూర్తి చేసి అనుభవం ఉండాలి. వయోపరిమితి 22 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తిగల వాళ్ళు మార్చి 11, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.