రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..! 1 y ago
TG: తెలంగాణలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో సాధారణంగా ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. తర్వాత వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేసింది. మార్చి 21 నుంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.